ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మహిళా నేత, యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే.. ఆయన ఎందుకు పరామర్శించలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. అక్కడికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదు? దళిత వర్గానికి చెందిన బాలిక అని చిన్న చూపా? అంటూ మండిపడ్డారు. ఏపీలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.