మీర్పేట్ పీఎస్ పరిధి మద్యం దుకాణంలో మద్యం తాగుతూ అకస్మాత్తుగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు సీఐ నాగరాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు. కేశవరావు (60) అనే వ్యక్తి టీచర్స్ కాలనీలో ఉన్న వైన్స్ లో మద్యం తాగుతూ అకస్మాతుగా చనిపోయాడు. ఈ విషయాన్ని డయల్ 100 ద్వారా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.