నెల్లూరు: దేశానికి మంచి పేరు తీసుకురావాలి: ఎమ్మెల్సీ
అంతర్జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్ క్రీడా టోర్నమెంట్ కు ఎంపికైన ఆశీర్వాదంను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. నెల్లూరు రాంజీ నగర్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీని నేపాల్లో జరగబోయే అంతర్జాతీయ టెన్నిస్ బాల్ క్రికెట్ క్రీడా టోర్నమెంట్ కు ఎంపికైన ఆశీర్వాదం కలిశారు. దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా క్రీడల్లో రాణించాలని పర్వత రెడ్డి సూచించారు.