AP: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

68பார்த்தது
AP: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
AP: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అంగళూరు గ్రామం నుండి కౌతారం గ్రామానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన కొమ్మలపాటి సాయి(26) అనే యువకుడు బౌలింగ్ వేస్తూ హఠాత్తుగా కింద పడిపోయాడు. యువకుడిని గుడివాడ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. వైద్యుల పరీక్షలు చేసి గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు. సాయి మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

தொடர்புடைய செய்தி