నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో డివైడర్ కోసం తీసిన గుంటలు ప్రమాదకరంగా ఉన్నాయి. స్థానిక బట్వాడిపాలెం సెంటర్ నుంచి పొదలకూరు రోడ్డు సెంటర్ వరకు సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో డివైడర్ తో పాటు సెంట్రల్ లైటింగ్ పనులు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. గత 15 రోజులుగా వర్షాలతో పాటు పొదలకూరు రోడ్డులో లైటింగ్ కూడా తక్కువగా ఉండటంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు గుంటల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు.