రూ.50 వేల కంటే ఎక్కువ లావాదేవీలు, ఐటీఆర్ దాఖలు, బ్యాంక్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి. అయితే మీరు క్యూఆర్ కోడ్‌తో ఉండే కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ముందుగా NSDL వెబ్‌సైట్‌కి వెళ్లి పాన్, ఆధార్, DOB వంటి వివరాలు నమోదు చేయాలి. రూ.50 చెల్లిస్తే 15-20 రోజుల్లో కార్డ్ మీ ఇంటికి వస్తుంది. NSDL వెబ్ సైట్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోపు మీకు ఈ-పాన్ నెంబర్ వస్తుంది. దాన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.