AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే సూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. 24 గంటల్లో కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ప్రధాన ఓడరేవుల్లో అధికారులు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.