బొంరాస్ పేట మండలం నాందార్ పూర్ గ్రామంలో బుధవారం మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బీహార్ వాజ్ పేయ్ జయంతి వేడుకలను బీజేపీ మండల నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు బాబయ్య నాయుడు, జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు నాగురావు తదితరులు పాల్గొన్నారు.