ఇటీవల కురిసిన వర్షాలకు నెల్లూరు రూరల్ పరిధిలోని పలు రహదారులు దెబ్బ తినడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్ &బి అధికారులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్యాచ్ వర్క్ పనులను రెండు రోజుల్లో ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.