నెల్లూరు: పార్క్ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పార్కు స్థలాలు ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి హెచ్చరించారు. సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాల పాలెంలో సుమారు 50 లక్షలు రూపాయల వ్యయంతో పార్క్ తో పాటు, జగన్ కళాశాల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతి ప్రియ, పాల్గొన్నారు.