TG: అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య (వీడియో)

2238பார்த்தது
మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో అదనపు కట్నం కోసం వేధింపులతో వివాహిత బలైంది. 4 నెలల క్రితం ఉబ్బపెల్లి గణేష్‌తో సుకన్య (22) వివాహం జరిగింది. గణేష్ కు రూ.లక్ష నగదు, 3 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. పెళ్ళైన తర్వాత అదనపు కట్నం కోసం అత్తారింటి వారు వేధింపులకు గురిచేయడంతో సుకన్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గణేష్‌తో పాటు అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువుల ఆందోళన చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி