మాతా శిశు మరణాలు జరగకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ అన్నారు. నెల్లూరు తిక్కన ప్రాంగణంలో మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత మూడు నెలల్లో మూలాపేటకు చెందిన మాధవి, కోవూరు కు చెందిన మునిరత్నమ్మ ల మెటర్నల్ డెత్ జరగడంతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పీహెచ్సీ సిహెచ్సి డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల తో కలెక్టర్ సమీక్ష చేశారు.