నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పబ్లిక్ పార్కులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు, సచివాలయం కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు.