నెల్లూరులోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ ధ్వజస్తంభం వద్ద పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగణం గావించి తదుపరి బెడ మండపం ప్రదక్షిణలు చేయించారు. అనంతరం మంత్రిని స్వామివారి శేష వస్త్రముతో సత్కరించారు.