ఉదయగిరి మండలం తో పాటు చుట్టుపక్కల మండలాలైన దుత్తలూరు, వరికుంటపాడు, సీతారాంపురం, జలదంకి, వింజమూరు, మర్రిపాడు మండలాల వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు జరిగాయి. నిన్నటి వరకు ఎండగా ఉండి బుధవారం ఉదయం నుంచి ఒక్కసారి చిరుజల్లులు కురవసాగాయి. నెల్లూరు జిల్లాకు భారీ తుఫాన్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటు వర్షం కురుస్తుంది.