నేటి సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ అన్నారు. మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా నెల్లూరు కలెక్టరేట్లోని డిఆర్డిఎ సమావేశం హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి శేఖర్ పాల్గొన్నారు.