నెల్లూరు రూరల్ పరిధిలోని 33వ డివిజన్ ఎన్సిసి కాలనీలో ఉన్న ముస్లిం స్మశాన వాటికలో వర్షపు నీరుచేరి అంత్యక్రియలకు ఇబ్బందిగా ఉందని స్థానిక ముస్లిం పెద్దలు శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందిస్తూ మున్సిపల్ అధికారులకు తెలియజేసి స్మశాన వాటికలో నీరు నిల్వ లేకుండా చదును చేయాలని ఆదేశించారు.