నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫెంగాల్ తుఫాను నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో చిరు వ్యాపారులు సామాన్య ప్రజలు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక లోతట్టు, శివారు ప్రాంతాలు నీట మునిగాయి.