వరంగల్: ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణాలకు పెనాల్టీ
ఇంజనీరింగ్ సంబంధిత నిర్మాణ పనుల్లో నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. అభివృద్ధి పనులు పూర్తయి బిల్లుల చెల్లింపు కోసం సిద్ధంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హంటర్ రోడ్ లో ట్రేడ్ లైసెన్స్ లు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న మారుతి సుజుకి షో రూం, టైల్స్ దుకాణంతో పాటు పెట్రోల్ బంక్ వారికి పెనాల్టీలు విధించాలన్నారు.