ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు వాటిని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ ధ్రువీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రతి బృందం రోజుకు ఇరవై దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను అదే రోజు అందజేయాలన్నారు.