జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా గురువారం ఎన్నికయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్లా 49 మంది శాసనసభ్యులతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఒమర్ అబ్దుల్లాకు నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల కూడా మద్దతు ఇచ్చారు.