
నేరెల్ల: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
కారు ఢీకొని రైతు మృతి చెందిన ఘటన ధర్మపురి మండలం నేరెల్ల వద్ద చోటు చేసుకుంది. నేరెల్లకు చెందిన రైతు లెంకల లింగన్న (67) బుధవారం సాయంత్రం తన పొలానికి నీళ్లు పెట్టేందుకు రోడ్డుపై నుంచి పొలాన్ని గమనిస్తూ నడుస్తున్న అతన్ని జగిత్యాల వైపు నుంచి ధర్మపురికి వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.