

కరీంనగర్: భావోద్వేగానికి గురైన బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి
కరీంనగర్ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటువేసిన ప్రతి ఒక్కరికి. వారితో పాటు తాను గెలవాలని క్షేత్రస్థాయిలో ఓటుహక్కు లేకపోయినా ఎంతో కష్టపడ్డా వారందరికీ మాజీ ప్రొఫెసర్, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం ఆయన అభిమానులతో సమావేశం అయ్యారు. తనపై చూపించిన ప్రేమకు పాదాభివందనం చేస్తున్నామని భావోద్వేగానికి గురయ్యారు.