
రాయికల్: ఏకగ్రీవంగా అల్లిపూర్ పద్మనాయక యువజన సంఘం ఎన్నికలు
రాయికల్ మండలం అల్లిపూర్ పద్మనాయక యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘ భవనంలో హాజరైన వెలమ కులబాంధవులచే ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొజ్జ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా. కొండపలుకుల రాజురావు, ఉపాధ్యక్షులుగా కట్ట రవీందర్ రావు, కోశాధికారి ద్యావనపల్లి వేణురావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు.