

బుగ్గారం: ఘనంగా ఛత్రపతి శివాజీ ర్యాలీ
బుగ్గారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఛత్రపతి శివాజీ ర్యాలీ ఘనంగా జరిగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఛత్రపతి శివాజీ భారీ చిత్ర పటంతో ఊరేగింపు జరిపారు. ఈ సందర్భంగా యువత ఛత్రపతి చరిత్ర మండల ప్రజలకు వివరించారు. పట్టణ నడి బొడ్డున ప్రధాన డబల్ రోడ్డు పై ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నిలపాలని నిర్ణయించారు. త్వరలో కమిటీ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.