భరోసాగా నిలిచిన బీఆర్ఎస్ బీమా
కల్హేర్ మండలం మిర్జాన్పేట్ గ్రామానికి చెందిన కూలి శేఖర్ ప్రమాదవశాత్తు ఇటీవల మరణించారు. ఆయన పేరు మీద ఉన్న బీఆర్ఎస్ బీమా రూ. 2లక్షల చెక్కును ఆయన భార్య పద్మకు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం కష్ట సమయాల్లో ఆదుకుంటుందని ఆయన అన్నారు. ఇలాంటి పథకం ఏ రాజకీయ పార్టీలో లేదన్నారు.