
రంగారెడ్డి: ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భావించి భయపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లిలో చోటు చేసుకుంది. ప్రణీత(18) అనే అమ్మాయి బాత్రూమ్ లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పుట్టినరోజే ఇలా చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని కొన్నిరోజులుగా కూతురు ఆవేదనతో ఉందని వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.