యూపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని యమునాపార్‌లోని నారిబారి మార్కెట్‌లో బైక్‌పై వచ్చిన యువకులు ట్రాక్టర్ వ్యాపారుల కారుపై బాంబు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన వ్యాపారులు వెంటనే కారు దిగి బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.