తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హస్తం పార్టీకి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన దిలీప్ కుమార్ ను రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్‌గా ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు.