
తలకొండపల్లి: భూవివాదంలో నలుగురి బైండోవర్
భూ వివాదంలో తలకొండపల్లి గ్రామానికి చెందిన యాదయ్య, ఆంజనేయులు, గణేష్, పార్వతమ్మలను గురువారం తహశీల్దార్ నాగార్జున ముందు బైండోవర్ చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. భూ వివాదంలో ఇరువురుపై కేసులు నమోదు కాగా రాజీ కుదుర్చుకోకపోవడంతో బైండోవర్ చేసినట్లు ఆయన చెప్పారు. బైండోవర్ అయినవారు ఏడాదిలోగా నేరాలకు పాల్పడితే 5 లక్షల డిపాజిట్, ప్రభుత్వ ఖాతా జప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.