కాంగ్రెస్ ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని హత్య చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమర్జెన్సీ పేరుతో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హత్య చేసిందని ఆరోపించారు. ప్రజలు ఎదురుతిరిగి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ప్రధాని మోదీ కృషి చేశారని కొనియాడారు.