అంబేద్కర్ జీవితం భావి తరాలకు ఆదర్శమని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చెప్పారు. తలకొండపల్లి మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన రచించిన రాజ్యాంగ ఫలాలతోనే నేడు అన్ని వర్గాలకు రాజకీయ, సామాజిక రంగాలలో సమాన అవకాశాలు దక్కుతున్నాయని పేర్కొన్నారు. యాదయ్య, జ్యోతయ్య, డేవిడ్, శంకర్, రవి, చంద్రకుమార్ చందు పాల్గొన్నారు.