వడగళ్ల వానకు నష్టపోయిన తెలంగాణ రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం తెలిపారు. మార్చిలో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. ఈ నెల 3-9 తేదీల మధ్య వడగళ్ల వాన, ఈదురు గాలులతో జరిగిన నష్టంపై రైతుల నివేదిక ప్రభుత్వానికి చేరిందని తెలిపారు. త్వరలో పరిహారం చెల్లింపు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.