తెలంగాణలో యాసంగి సీజన్ వడ్ల కొనుగోలు కేంద్రాలు జూన్ నెలాఖరు వరకు కొనసాగించేలా శుక్రవారం పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు మొదలయ్యాయి. పంట కోతలను బట్టి ఆయా ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి.