ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పిల్లలు, పెద్దలు, యూత్ పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకొని భారత జాతీయ జెండాలను ఎగురవేస్తూ టీమిండియా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇండియా ఇండియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.