సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై తెలుగుదేశం నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాధవీలత మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించి, తన పరువుకు భంగం కలిగించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.