తెలంగాణ భూ భారతి యాక్ట్, 2025ను ఈ నెల 14న సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజునే భూ భారతి చట్టం ప్రొవిజన్స్‌తో కొత్త పోర్టల్‌ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో కార్యక్రమం జరగనుండగా.. ఇందుకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లను శుక్రవారం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆదేశించారు.