
రంగారెడ్డి: క్రీడల్లో గెలుపోటములు సహజం: ఎమ్మెల్యే
కొందూర్గ్ మండలంలోని ఉత్తరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఉత్తరాస్ పల్లి ప్రీమియర్ లీగ్ ముగింపు సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. అతి త్వరలో కొందూర్గ్ లో నిర్మించే మినీ స్టేడియంకి పరిపాలన అనుమతులు వచ్చినట్టు తెలిపారు.