ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తాజాగా కీలక ప్రకటన చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా రైతులకు ఇబ్బంది ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం మంచి పథకమని కొనియాడారు. కేంద్రం నుంచి వచ్చేవి దొడ్డుబియ్యం మాత్రమేనని చెప్పారు.