TG: మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాకేంద్రానికి చెందిన గిర్మాపూర్‌లో రోబో సిలికాన్ క్రషర్ మిషన్‌లో పడి మధ్యప్రదేశ్‌కు చెందిన మనీష్ సింగ్ (28) దురదృష్టవశాత్తూ మృతిచెందాడు. తోటి పనివారు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.