శేరిలింగంపల్లి: ఎస్సీలకు సముచిత న్యాయం జరిగేలా చూస్తాను: రామచందర్
ఎస్సీ సామాజిక వర్గానికి అన్ని రంగాలలో సముచిత న్యాయం జరిగేలా చూస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు కేటాయించిన నిధులను విధిగా వారికే అందజేయాలని, అభివృద్ధికి అన్ని డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు అందుకు సహకరించాలని కోరారు.