ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల తూటాలు పేలుస్తున్నారు. రోజు రోజుకు సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆరు గ్యారెంటీలపై, రైతు రుణమాఫీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. మంగళవారం దీనిపై కేటీఆర్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ. రేవంత్‌ను పరోక్షంగా ‘‘చిట్టినాయుడు’’ అంటూ స్పందిస్తూ ఎద్దేవా చేశారు.