ఏపీకి మరో ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం బుధవారం తుఫానుగా, గురువారం తీవ్ర తుఫానుగా బలపడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఏపీ, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, బెంగాల్ వద్ద వాయుగుండం తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.