మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం గీత కార్మికులకు రక్షణ కవచాన్నిమహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గీత కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, అన్ని రంగాలను ఏకతాటిపై నడిపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు.