‘లింగ సమానత్వం గురించి కొడుకులకు తల్లులే చెప్పాలి’ అని ప్రముఖ నటి కరీనా కపూర్ అన్నారు. కోల్‌కతా వైద్యు రాలిపై హత్యాచారంపై ఆమె NDTV సమ్మిట్‌లో స్పందించారు. 'లింగ సమానత్వం గురించి పిల్లలకు 4-5 ఏళ్ల నుంచే ఇంట్లో నేర్పించాలి. అసౌకర్యంగా ఉన్నప్పటికీ తల్లులే ఈ విషయాలపై వారితో మాట్లాడాలి. నా కొడుకులు తైమూర్ (7), జహంగీర్ (3)కు కూడా నేను ఆడపిల్లలను గౌరవించడం గురించి చెబుతా' అని పేర్కొన్నారు.