AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటలలోపు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. వెబ్ ఆప్షన్ల నమోదులో ఎలాంటి సమస్యలు తలెత్తినా ఫోన్: 90007 80707, 80082 50842 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.