ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగుళూరు సమీపంలో ఆదివారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి హాజరైయ్యారు. అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సబితాఇంద్రారెడ్డి అన్నారు.