కందుకూరు మండల పరిధిలోని లబ్ధిదారులకు ఈ నెల 23న తేదీన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తహసిల్దార్ గోపాల్ మంగళవారం తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. బుధవారం ఉదయం 10: 30 గంటలకు మండల పరిషత్ సమావేశం హాల్లో 64 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయనుందని వెల్లడించారు. లబ్ధిదారులు హాజరుకావాలని తహసిల్దార్ కోరారు.