మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ 2 పథకంలో భాగంగా రూ. 306 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. రెండేళ్లలో పనులు పూర్తిచేసి ఐదేళ్లలో వాటిని నిర్వహించే బాధ్యతను టెండర్లు దక్కించుకున్న కంపెనీకి అప్పగించారు. కొత్త కాలనీలకు ఫీడర్ పైపులైన్లు, రిజర్వాయర్లు, సంపులు, కొత్త నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో వేసవిలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది.