మంచిర్యాల జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ బదిలీలలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిటిడబ్ల్యూవోను విధుల నుండి తొలగించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐటిడిఎ పిఓకు తప్పుడు సమాచారం ఇచ్చి వార్డెన్ల బదిలీలను పక్కదారి పట్టించారని తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు.